భారీ వర్షాలు..ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది

గౌహత: భారీ వర్షాల కారణంగా అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. ధేమాజీ, దిబ్రూఘర్, లఖింపూర్ జిల్లాలోని 46 గ్రామాలను వదరలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/