పేర్ని నాని నివాసానికి వెళ్లిన సిఎం జగన్‌

పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం

పేర్ని నాని నివాసానికి వెళ్లిన సిఎం జగన్‌
cm jagan-perni nani

అమరావతి: ఇటీవల ఏపి మంత్రి పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ(82) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిఎం జగన్‌ పేర్ని నానిని పరామర్శించారు. నాని నివాసానికి వెళ్లారు. విషాదంలో ఉన్న నాని కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

నాగేశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే నయం అయిందని భావించి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేయగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కాగా, నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సమాచార మంత్రిత్వ శాఖను నిర్వహించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/