అఖండ థియేటర్ లో అగ్ని ప్రమాదం..పరుగులు పెట్టిన ప్రేక్షకులు

తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజు చూడాలని అభిమానులంతా థియేటర్స్ కు పరుగులుపెట్టారు. ఎప్పుడెప్పుడు బాలయ్య ను చూద్దామా అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా థియేటర్ ను పొగ కమ్మేసింది. ఏంజరుగుతుందో తెలుసుకునేలోపే ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని జెమినీ థియేటర్ లో చోటుచేసుకుంది.

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కించారు. బినెఫిట్ షో నుండే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో సినిమాను చూసేందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ లోని జెమినీ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కొద్దీ క్షణాల్లోనే థియేటర్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. థియేటర్ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.