సెమీఫైనల్ లోకి ఆస్ట్రేలియా మహిళా జట్టు

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ -2022 లో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకుంది. భారత్‌పై ఆస్ట్రేలియా 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా ఐదో విజయం. ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కాగా, 5 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది మూడో ఓటమి. టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, ఆస్ట్రేలియన్ మహిళల జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
278 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు తమ జట్టుకు సెంచరీ భాగస్వామ్యం అందించారు. హన్స్, హీలీ మధ్య 121 పరుగుల భాగస్వామ్యం, కెప్టెన్ మాగ్ లెన్నింగ్, ఎల్లీస్ పెర్రీ మధ్య 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరి భాగస్వామ్యం, ఆ జట్టుకు విజయం అందించింది
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/