ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండో విజయం సాధించింది. అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించి బోణి కొట్టగా… భద్రాద్రి జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఈయన BRS అభ్యర్థి బానోతు హరిప్రియపై విజయ డంఖా మోగించారు.