సిఎం జగన్‌ మామ గంగిరెడ్డి మృతి

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యం బారినపడిన గంగిరెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో గంగిరెడ్డి అంత్యక్రియలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  అంత్యక్రియలకు సిఎం జగన్‌ హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/