సొంత కమాండర్‌నే హత్య చేసిన మావోయిస్టులు

వ్యక్తిగత కక్షలతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నాడని ఆరోపణ

MAVOISTS
MAVOISTS

చత్తీస్‌గఢ్‌: వ్యక్తిగత కక్షలతో అమాయక గిరిజనులను చంపుతున్నాడని ఆరోపిస్తూ చత్తీస్‌గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్‌నే హత్యచేశారు. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జిల్లాలోని గంగులూరు ఏరియాలో మావోయిస్టులు ఇటీవల పలువురు ఆదివాసీలను హత్య చేశారు. వీరిలో అమాయక ఆదివాసీలు కూడా ఉండడం మిగతా మావోలకు నచ్చలేదు. గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్ విజా మొడియం అలియాస్ భద్రు (34) వ్యక్తిగత కక్షలతో, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఈ హత్యలు చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు గుర్తించారు. దీంతో గురువారం అతడిని అదుపులోకి తీసుకుని గంగులూరు-కిరండోల్‌ మధ్యనున్న ఎటావర్‌ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/