అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోడి

PM Shri Narendra Modi inaugurates Atal Tunnel in Rohtang, Himachal Pradesh.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి హిమాచల్‌ ప్రదేశ్ లోని రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్‌ టన్నెల్‌ను ప్రారంభించారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో 9.02 కిలోమీటర్ల పొడవుగా నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. మనాలీ నుంచి లాహోల్‌స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల మనాలీ నుంచి లఢక్ లోని లేహ్‌ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా ఇది సొరంగం కావడం వల్ల దీన్లోకి మంచు రాదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు లఢక్, అక్సాయ్‌ చిన్‌ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానితో కలిసి దక్షిణ ఎంట్రీ నుంచి ఉత్తరం వైపు సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. ఆ తర్వాత మోడి దక్షిణ ద్వారం వైపు వెళ్లే హిమాచల్‌ ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడి వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/