మరోసారి వాయిదా పడిన జగన్ కొవ్వూరు పర్యటన

వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ నెల 24కు వాయిదా పడిన కార్యక్రమం

cm-jagan-tour-to-kovvuru-once-again-postponed

అమరావతిః సిఎం జగన్‌ కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడింది. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో, భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

తిరిగి ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండు రోజల క్రితం అధికారులు ప్రకటించారు. దీనికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జగన్ కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడినట్టు హోంమంత్రి తానేటి వనిత నిన్న తెలిపారు. ఈ నెల 24న సీఎం కొవ్వూరు పర్యటన ఉంటుందని పేర్కొన్నారు.