నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ

అమరావతి: ఏపి సిఎం జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. కాగా సిఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా తో భేటీ కానున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/