రైతులకు న్యాయం చేసే విధంగా సీఎం ప్రకటన చేస్తారు

రాజధానిని మార్చుతామని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్పలేదు

mla roja
mla roja

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా శాసనసభలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారని ఆమె స్పష్టం చేశారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదన్నారు. అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు రాష్ట్రంలో ఏర్పాడుతాయని అన్నారు. కాగా గత టిడిపి ప్రభుత్వం అమరావతిలో తాత్కాలిక నిర్నాణాలే ఎందుకు కట్టిందని చంద్రబాయు నాయుడిని ఆమె నిలదీశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు జోలె పట్టాల్సిందని, ఇప్పుడేందుకు పడుతున్నారో అని రోజా విమర్శించారు. ఏపీని చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని ఆమె దుయ్యబట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/