ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు..ముఖ్యఅతిథి గా కవిత

ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో మొదటిసారి బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు రావాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సదరు సంస్థ అధ్యక్షులు డాక్టర్ శాంతిరెడ్డి, ఎమ్మెల్సీ కవితను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియన్ ఎంపీలు కూడా పాల్గొననుండడం గమనార్హం.

దసరా పండగ వస్తుందంటే చాలు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ఖ్యాతి ఖండాతరాల్లో కూడా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం మరోవైపు కవిత కోవిడ్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. మరి ఆ టైం కల్లా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంటె పాల్గొంటారు కావొచ్చు.