భారత విమానయాన రంగంలోకి అమెరికా దిగ్గజం

America is a giant in the Indian aviation sector

హైదరాబాద్‌ః అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ భారత దేశంలో తమ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. ఏవియేషన్ రంగంలో ప్రయాణీకులకు సరికొత్త అనుభూతులు కలిగించే విధంగా ఎన్ఎస్ ఏవియేషన్ ప్రణాళికలు రూపొందించింది. ఇండియన్ ఏవియేషన్ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న ఈ తరుణంలో ఎన్‌ఎస్ ఏవియేషన్‌కు చెందిన కొన్ని పదుల సంఖ్యల ఏయిర్ బస్సులు ఆకాశల్లో ప్రయాణీకులను మరింత అలరించనున్నాయి.

భారత దేశంలో తమ సేవలను ప్రారంభిస్తున్న ఎన్ఎస్ ఏవియేషన్ ఇక్కడి ట్రూజెట్ సంస్థలో 85% శాతం వాటాను కొనుగోలు చేసింది‌‌. ఈ రంగంలో సరికొత్త అవకాశాలకు నాంది పలుకుతూ వేలకొలది ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనను ఎన్ఎస్ ఏవియేషన్ కలిగి ఉంది.

ఎన్ఎస్ ఏవియేషన్ అమెరికా ఫ్లోరిడాకు చెందిన సంస్థ. గ్లోబల్ ఏవియేషన్ ఇన్వెస్టర్‌గా పేరుగాంచింది. ఈ సంస్థ డెబ్ట్ ఫ్రీ సంస్థగా కూడా కొనియాడబడుతుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో విమానయాన రంగంలో ఎన్ఎస్ ఏవియేషన్ పెట్టుబడులు, వాటాలు ఉన్నాయి. భారత దేశంలో విమానయాన రంగంలో తమదే అయిన ముద్ర వేసేందుకు ఏయిర్‌బస్ 320 నియో ఏయిర్ క్రాఫ్ట్‌లను తీసుకురానున్నారు. రానున్న కాలంలో ఎన్ఎస్ ఏవియేషన్ 100కు పైగా ఏయిర్‌బస్‌లను భారత్‌లో నడపనున్నారు.

భారత్‌లో సేవలను ప్రారంభించే తరుణంలో ఎన్ఎస్ ఏవియేషన్ ముందుగా డొమెస్టిక్ సెక్టార్‌ను ఎంచుకుంది. మెట్రో నగరాలైన ముంబయి, న్యూ ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ లలో తొలుత ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత దేశంలోని అన్ని మహానగరాలకూ విస్తరిస్తుంది. ఎన్ఎస్ ఏవియేషన్ తీసుకురానున్న A320 ఏయుర్‌బస్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటాయి. భారత ఆకాశ మార్గాలలో వాతావరణం, ఏయిర్ ట్రాఫిక్‌లకు అనుకూలంగా ప్రయాణించే టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

విమానయాన ఎంగంలో ఇరవై ఏళ్ళ సుధీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అలీ భారతదేశంలో తమ సేవలను ప్రారంభించే ఆలోచనతో ట్రూజెట్ సంస్థలో వాటాలు కొనుగోలు చేసి ఇండియాకి ఎంట్రీ ఇచ్చారు. డెబ్ట్ ఫ్రీ సంస్థగా పేరుగాంచిన ఎన్ఎస్ ఏవియేషన్ భారత్‌లో మొదలుపెడుతున్న సేవలను కూడా డెబ్ట్ ఫ్రీగానే ప్రారంభించనున్నారు‌‌. కొన్ని వందల కోట్ల మార్కెట్ విలువగల ట్రూజెట్‌లో 85% శాతం వాటాలను డాక్టర్ అలీ కొనుగోలు చేసి ఇండియన్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఏయిర్‌లైన్ గా పేరుగాంచిన ట్రూజెట్ ఎన్ఎస్ ఏవియేషన్ ద్వారా పునరుద్ధరింపబడుతోంది‌. పోస్ట్ కోవిడ్ విమానరంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఒకప్పుడు కస్టమర్ల బెస్ట్ ఛాయిస్‌గా నడిచిన ట్రూజెట్ సేవలు ఇకపై నిరాటంకంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

భారతదేశంలో ట్రూజెట్ సంస్థకు 116 మార్గాలలో ప్రయాణించే అనుమతి ఉంది. ఎన్ఎస్ ఏవియేషన్ ఒప్పందంతో దేశంలోని మెట్రో నగరాలు, టూ టయర్ సిటీలను కలుపుతూ వంద ఏయిర్ బస్‌లు అక్టోబర్ నెల నాటికి తమ సేవలందించడానికి సిద్ధమౌతున్నాయి.

హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అలీ, వైస్ ఛైర్మన్ ఈశా అలీ, ట్రూజెట్ వ్యవస్థాపకులు వి ఉమేశ్ ‌లు పాల్గొని రెండు సంస్థల ఒప్పందం, వ్యాపార విస్తరణల పై తమ అభిప్రాయాలను తెలిపారు.

భారత దేశ ప్రయాణీకులకు సరికొత్త ఇన్‌ఫ్లయిట్ ఎక్స్‌పీరియన్స్, ఫుల్ సర్విస్ ఏయిర్‌లైన్స్, మరిన్ని సరికొత్త ఫ్రెండ్లీ ఫెసిలిటీస్‌ను అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని. తొలుత మెట్రో నగరాలలో ప్రారంభించి ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తామని ట్రూజెట్ వ్యవస్థాపకులు ఉమేశ్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఎక్జిట్ అవుతున్న సమయంలో ఇండియాలో పెరుగుతున్న ట్రావెలర్స్ సంఖ్యను గమనిస్తూ వాళ్ళకు మెరుగైన సేవలను అందిస్తూ నెక్స్ట్ జనరేషన్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా తమ సేవలు ఉంటాయని ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ వైస్ ఛైర్మన్ ఈశా అలీ చెప్పారు. ఇండియాలో ప్రారంభిస్తోన్న తమ సేవలు, పెట్టుబడులు అన్నీ డెబ్ట్ ఫ్రీగా ఉంటాయని ఈశా అలీ అన్నారు.