అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణం : సీఎం జగన్‌

అల్లూరి పుట్టిన గడ్డపై పుట్టడం మన అదృష్టమని వ్యాఖ్య

cm-jagan-speech-in-bhimavaram

అమరావతిః అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా ఏకమయ్యామని ఏపీ సిఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణమని కొనియాడారు. తెలుగు జాతికే కాకుండా, యావత్ దేశానికి అల్లూరి ఒక స్ఫూర్తిప్రదాత అని అన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకోవడానికే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. ఆయన తెలుగుగడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/