ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు : సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన..విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన సీఎం

YouTube video
Hon’ble CM of AP will be Disbursing “Jagananna Vidya Deevena” Virtually from A.P Secretariat LIVE

అమరావతి : సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. ఈ సదర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. డబ్బుల సమస్యతో ఏ ఒక్కరూ చదువుకి దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/