భావితరాలకు స్ఫూర్తి కొండా లక్ష్మణ బాపూజీ

ప్రగతి భవన్‌లో లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి

TS CM KCR
TS CM KCR

Hyderabad: కొండా లక్ష్మణ్‌ బాపూజీ నేటితరానికే కాకుండా భావితరాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన ప్రగతి భవన్‌లో లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో, నాన్‌ ముల్కీ ఆందోళనలో బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు .

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/