ఏపిలో ప్రభుత్వ భూముల అమ్మకంపై విచారణ వాయిదా

ఉన్న భూములు అమ్ముకోవడం ఏంటన్న న్యాయస్థానం

ap high court
ap high court

అమరావతి: ఏపి హైకోర్టులో ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముతున్నారంటూ, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు సామాజిక కార్యకర్త సురేశ్ బాబు దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వ్యవధి కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అనేక విధాలా తప్పుబట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఏంటి? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని వివరించారు. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికిందని న్యాయవాది తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/