కృష్ణ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ

హైదరాబాద్ః ఏపి సిఎం జగన్‌ పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకుని సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కాగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

నట శేఖరుడిని కడసారి చూసుకునేందుకు అభిమానులు బారులు తీరారు.కాగా తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం తరువాత మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/