కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమిపూజ

కడపః సిఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం.. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడిగింది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం జగన్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.