రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం

మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపికి సంబంధించిన నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలోనే సిఎం జగన్‌ తన జగన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి తెలిపింది. జగన్‌తో పాటు ఇప్పటికే పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో పాటు పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టిడిపి నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/