ఏపి గవర్నర్‌లో సిఎం దంపతులు భేటి

గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్‌, వైఎస్‌ భారతి

cm-jagan-meets-governor

అమరావతి: సిఎం జగన్‌ దంపతులు ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో సిఎం వివరించనున్నారు. అలాగే ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే తేదీలపై సిఎం జగన్ గవర్నర్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/