భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఐక్యరాజ్య సమితి

United Nations
United Nations

న్యూయార్క్‌: భారత్‌కు ఐక్కరాజ్య సమితి ధన్యవాదాలు తెలిపింది. సకాలంలో పన్నులు చెల్లించినందుకుగాను భారత్‌ సహా మరో మూడు దేశాలకు కూడా ఐక్కరాజ్య సమితి ధన్యవాదాలు తెలిపింది. మొత్తం 193 దేశాల్లో గడువుకన్నా ముందే పన్నులు చెల్లింది కేవలం నాలుగు దేశాలేనని పేర్కొంది. భారత్‌ 23,396,498 డాలర్ల పన్ను 01.02.2020 నాటికి చెల్లించాల్సి ఉంది. అయితే ఇంకా గడువు ఉండగానే భారత్‌ చెల్లింపులు పూర్తి చేసినందుకు భారత్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా భారత్‌తో పాటు పోర్చుగల్‌, ఉక్రెయిన్‌, అర్మేనియాలు ఇప్పటికే పన్నులు చెల్లించాయని పేర్కొంది. ఇది చూసి మరిన్ని దేశాలు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 సంవత్సరానికి చెందిన పన్నులకు సంబంధించిన పన్నులు ఇంకా చెల్లించాల్సిన దేశాలు పది ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/