రేపు కెసిఆర్‌ను కలవనున్న సీఎం జగన్

cm-jagan-meeting-with-kcr-tomorrow

హైదరాబాద్‌: రేపు మాజీ సిఎం కెసిఆర్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు రేపు ఉదయం హైదరాబాద్‌ బయలు దేరనున్నారు. ఇటీవల కెసిఆర్ తన తుంటికి ఆపరేషన్‌ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని తన ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌ కు సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.