నేడు ట్రాన్స్‌కో సబ్ స్టేషన్లకు సిఎం జగన్ శంకుస్థాపన

cm-jagan

అమరావతిః ఏపిలో 28 కొత్త సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలను వర్చువల్ విధానంలో చేయనున్నారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా రూ. 3,100 కోట్ల వ్యయంతో వీటిని ట్రాన్స్ కో ఏర్పాటు చేస్తోంది. అలాగే కడపలో 750, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. వీటివల్ల 1,700 మందికి ఉపాధి లభించనుంది.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి జగనన్న ప్రభుత్వం అతి పెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరపబోతోంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన వాళ్లు పోటీ పడేలా తీర్చి దిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందింస్తుంది.