పోలవరం ప్రాజెక్టు పనులపై దిశానిర్దేశం

ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి : సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. ఆపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2023 నాటికి ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. 50 ఆవాసాల్లోని నిర్వాసితులను తరలించాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. వేగంగా నిధులు, అనుమతులు తెచ్చేందుకు మరో అధికారిని నియమించాలన్నారు. కేంద్రం నుంచి సకాలంలో డబ్బులు వచ్చేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. కేంద్రం నుంచి బిల్లుల మంజూరు కోసం అధికారిని ఢిల్లీలో ఉంచాలని వివరించారు. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.2.200 కోట్లు రాబట్టేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

2022 జూన్ నాటికి రెండు కాల్వలకు లింకు పనులు, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తికావాలని అన్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ బిల్లులు ఎక్కడా పెండింగ్ లో పెట్టడంలేదని తెలిపారు. వచ్చే నెలలో ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శిస్తానని వెల్లడించారు. సీఎం జగన్ పోలవరం క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా స్పిల్ వే, అప్రోచ్ చానల్ ను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/