కేటీఆర్ కు బండి సవాల్ ..

తెలంగాణ లో BJP vs BRS వార్ నడుస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి సన్నాహాలు చేస్తుంది. అందుకే ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలతో పాటు అధికార పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోమవారం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్‌ ఇచ్చారు. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మెరగడం ఎందుకన్నారు. ఎప్పుడో పిసిసి అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడు.. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్ కి రెడీ అంటుండని వెల్లడించారు.

డ్రగ్స్ పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని..దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని.. నేను తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా ? అని నిలదీశారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే తెలంగాణ లో పేదోళ్ల పరిస్థితి దారుణం అవుతదని.. మీ భాష చూసి నవ్వుకున్నామన్నారు.

ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందని.. హైదరాబాద్ డ్రగ్స్ కేసు కుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేసారని పేర్కొన్నారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసిందని.. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.