తెలుగు లో కుమ్మేస్తున్న ‘సార్’ కలెక్షన్స్

ధనుష్ – సంయుక్త జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన సార్ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.’జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్ .. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్’ అనే కాన్సెప్టును కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఆచరణలోకి తెచ్చారు. ఈ కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించేలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చరర్ చేసిన పోరాటమే ‘సార్’ సినిమా. ఇక సినిమా బాగుందనే టాక్ రావడం తో సినిమాను చూసేందుకు యూత్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పోటీపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో నైజాంలో రూ. 4.01 కోట్లు, సీడెడ్ లో రూ. 1.43 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.31 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 97 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 38 లక్షలు, గుంటూరు 82 లక్షలు, కృష్ణా రూ. 469 లక్షలు, నెల్లూరు రూ. 39 లక్షల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల షేర్, రూ. 18.61 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 95 లక్షలు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 10.95 కోట్లు షేర్, రూ. 20.55 కోట్లు గ్రాస్ రాబట్టింది.