జనసేన లోకి మంత్రి విశ్వరూప్..?

గత కొద్దీ రోజులుగా ఏపీ లో మంత్రి విశ్వరూప్ కు సంబదించిన ఓ వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్ త్వరలో జనసేన పార్టీ లోకి చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండడం తో అంత నిజమే కావొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్తల ఫై మంత్రి విశ్వరూప్ క్లారిటీ ఇచ్చారు. నాకు పార్టీ మారే ఉద్దేశమే లేదు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.

నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కేబినెట్ మంత్రిగా తీసుకుని జగన్ గౌరవించారు. ఆయనకు నేను అండగా ఉంటా. కొందరు పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం కావాలంటే పవన్ 175 స్థానాలో పోటి చేసి విజయం సాధించాలని… లేదంటే కనీసం 100 స్థానాల లో అయినా పోటి చేసి 50 సీట్లలో గెలిచి అయినా సీఎం అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలని చురకలు అంటించారు.