చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్ షాట్లే – జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై విరుచుకపడ్డారు. రీసెంట్ గా చంద్రబాబు నిర్వహించిన టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.కందుకూరు లో 8 మంది , గుంటూరు లో ముగ్గురు మరణించారు. ఈ తొక్కిసలాట వెనుక వైస్సార్సీపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపణల ఫై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంపేది చంద్రబాబే.. మొసలికన్నీరు కార్చేది ఆయనే అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్‌షాట్లు, డ్రామాలు.. సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో డ్రోన్‌ షాట్ల కోసం 29 మందిని పొట్టనబెట్టుకున్నారని జగన్ అన్నారు.

కందుకూరులో జనాన్ని ఎక్కువ చూపించేందుకు చిన్న సందులో ప్రజల్ని నెట్టారు, తన డ్రోన్‌ షాట్లు, ఫొటో షూట్ల కోసం 8 మందిని చంపేశారని ఆరోపించారు. తన ప్రచారం యావ కోసం చంద్రబాబు సభలు, పుష్కరాల్లో ప్రజలను బలితీసుకున్నా పవన్ కళ్యాణ్ కానీ , చంద్రబాబు అనుకూల మీడియా గాని దీనిపై స్పందించారని జగన్ మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తాడు. ఫోటోషూట్, డ్రామాలే చంద్రబాబు నైజాం అన్నారు. చంద్రబాబు తప్పు చేసి పోలీసులదే తప్పు అంటాడు. కందుకూరిలో 8 మంది చనిపోయిన, దాహం తీరనట్లు గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు’ అని సీఎం విమర్శల వర్షం కురిపించాడు.