మెట్రో కు షాక్ ఇచ్చిన సిబ్బంది..హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సేవలు

Metro train Speed hike
Hyderabad Metro Rail Staff on Lightning Strike

మెట్రో సిబ్బంది..సంస్థ కు భారీ ఇచ్చారు. ఐదేళ్లు గా తమ జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. దీంతో హెచ్‌ఎంఆర్ఎల్ ..సిబ్బందికి వార్నింగ్ ఇచ్చింది. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా హెచ్చరించింది. స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నా చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే యాజమాన్యం హెచ్చరికలపై ఉద్యోగులు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు.. మా సమస్యల ప్రస్తావిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా అంటు సిబ్బంది ప్రశ్నించారు.

మంగళవారం ఉదయం రెడ్ లైన్ సేవల వద్ద ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల నుంచి జీతాలు పెంచడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా విధులు బహిష్కరించారు. దీంతో ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది మాట్లాడుతూ, ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నామని వివరించింది. కియోలిస్ తో మరోసారి చర్చలకు రమ్మన్నారని.. ఈ రోజు సాయంత్రం కియోలిస్ ప్రతినిధులు వస్తామన్నారన్నారని మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది తెలిపింది. వేతనాలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశామని.. మరోసారి చర్చించిన తర్వాత మా నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.