సమాజంలో సమున్నతంగా

ఉన్నత స్ధానంలో నిలవాలంటే మీకు ఉండాల్సిన గుణాలు ప్రతిభ, సాధించాలనే పట్టుదల అందుకు తగ్గ తెగువ, మీ మాటల్లో ఎప్పుడూ మనీ సంబంధాలు కాకుండా, మానవ సంబంధాలు ఉండేలా చూసుకోవాలి. మీరు చేసే పని ఎంత చిన్నదైనా సరే మంచిదైతే, మీకు మేలు చేసేదైతే తప్పకుండా చేయండి. తప్పు చేయనంత వరకూ ఏ పని చేసినా పర్వాలేదు.
మీరంటే ఇతరులు నమ్మేలా వారికి మీ పైన నమ్మకం కలిగేలా ప్రవర్తించండి. అలా కాకుండా మీ బాధ్యతలను ఎప్పుడు మరచి పోకండి. బాధ్యతలను గురైరిగి ప్రవర్తించండి. అలా కాకుండా మీ బాధ్యతలను వదిలేసి హక్కుల గురించి ప్రశ్నించడం అవివేకమైన పని అని తెలుసుకోండి. మంచి మనుషులతో ఎప్పుడూ సత్సంబంధాలను కొనసాగించండి. మీ శ్రేయస్సుకు ఇవి ఎంతో అవసరం. ప్రతి రోజూ కనీసం కొంత సమయం భగవంతుని స్మరణకు సమయాన్ని కేటాయించాలి. పవిత్రమైన,నిర్మలమైన మనస్సుతో
ఆ భగవంతున్ని ధ్యానిస్తే ఎనలేని ప్రశాంతత, ఆత్మసంతృప్తి మీకు కలుగుతుంది. భగవంతున్ని మనస్సులో స్మరించుకోవడం, ఆయన కీర్తనలు ఆలపించుకోవడం మీలో ఎనలేని మానసిక ప్రశాంతతను సమకూరుస్తుంది. సెలవ్ఞ రోజుల్లో, తీరికగా ఉన్న సమయాల్లో మీఈ ఊరిలోనే మీకు దగ్గరగా ఉన్న ప్రాచీన ఆలయాలను దర్శించి కొంతసేప్ఞ అక్కడ గడపండి. మనస్సుకు ఎంతో ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతుంది. ఎక్కడా లభించని ప్రశాంతత వాతావరణం అక్కడ లభిస్తుంది. కనీసం వారానికి ఒక్క రోజైనా ప్రాచీన ఆలయాలను దర్శించండి. మంచి ప్ఞస్తకాలు చదవడం ఒక హాబిగా మార్చుకోండి. మీ వ్యక్తిత్వంపై అమితమైన ప్రభావాన్ని చూప్ఞతాయి. ఎందుకంటే ప్ఞస్తకానికున్న పవర్‌ అలాంటిది. నేడు సమాజంలో గొప్పవారిగా చెలామణీ అవ్ఞతున్న వారిలో చాలా మంది ప్ఞస్తక ప్రియులే. వాటి ప్రభావంతోనే వారు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకొని గొప్పవారిగా ఎదిగారని మరచిపోకండి. మీరు ఏ కార్యం చేపట్టిన విజయం సాధించగలమనే ధీమాతో ప్రరంభించండి. అనుక్షణం మీ మదిలో నిలుప్ఞకొంటూ అందులో విజయం సాధించేవరకు కష్టపడండి. గెలవగలమనే ధీమాను ఎట్టి పరిస్ధితుల్లోనూ వీడకండి. తప్పకుండా గెలుప్ఞ మీ సొంతమవ్ఞతుంది. ఎప్పటికీ ఎదుటివారి నుండి గొప్ప గుణాలను స్వీకరించండి. చెడును మాత్రం నిరాకరించండి.
మీకిష్టమైన పనిని ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ మెదడు ఉత్సాహంగా ఉన్నప్పుడు చేయండి. ఆ పనిని మరింత బాగా చేయగలుగుతారు. ఎదుటి వారి మాటలకు కూడా విలువివ్వండి. వినదగినవి, ఆచరింపదగినవి ఉంటే తప్పక తెలుసుకొండి. అందులో ఏ మాత్రం తప్పు లేదు. ఎప్పడూ ఎవ్వరికీ మీకు చేతకాని విషయాలను చేస్తామని హామీ ఇవ్వకండి. వీలైనంత వరకు చేతనైన సాయం చేయండి. మీరు ఎవ్వరికైనా సాయం చేస్తే ఆ విషయాన్ని తక్షణమే మరచిపోండి. ఆ విషయం మీరెవరితోనూ చెప్పకండి. మీకెవరైనా సాయం చేస్తే వారిని ఎప్పుడూ మరచిపోకండి. మీరు చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడే చేయండి. అలా చేయడం వలన మీరు చేసే పని మీకు కష్టంగా కాక ఇష్టంగా అనిపిస్తుంది. ఎంత శ్రమపడ్డా మీలో అలసట కనిపించక పని చేసే కొద్ది ఉత్సాహం కలుగుతుంది. మీరు తలపెట్టిన కార్యంలో మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు.మీకు లభించిన సమయాన్ని మిమ్మల్ని మీరు బాగు చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇలా అయితేనే ఇతరులను విమర్శించడానికి మీకు ఏ మాత్రం సమయం దొరకదు. మీ మనస్సులో మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం ఉంటే, విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. మీ ఆలోచన బలహీనంగా ఉంటే అపజయం మిమ్మల్ని పలకరిస్తుంది.
ఎప్పుడూ మీకు మంచే జరుగుతుందని భావించండి. మీ భావి జీవితం కూడా ఎలాంటి చీకూ చింత లేకుండా ఆనందంగా గడిచిపోతుందన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎవ్వరైనా హాని కలిగిస్తారేమో, మనకు ప్రమాదాలేమైనా సంభవిస్తాయేమో, భవిష్యత్‌ ఎలా ఉంటుదో ఏమో అనే అనవసర ఆందోళనలతో మీ జీవితంలో లేని పోని నెగటీవ్‌ ఆలోచనలను తెచ్చుకుని మీరూ బాధపడుతూ తోటి వారిని కూడా బాధపెట్టకండి. మీరేం మాట్లాడుతారో, ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో, ఊహిస్తారో అదే మీరన్న విషయం తెలుసుకోండి. మీ మాటలు, ఆలోచనలు, ప్రవర్తనలు, ఊహలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ పైన మీకు ఎనలేని నమ్మకాన్ని కలిగించుకోండి. ఎన్నడూ మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకూడదు. మీ మీదే మీరు నమ్మకాన్ని కోల్పోతే ఇతరులకు మీ మీద ఎటువంటి నమ్మకం కలిగించలేవని, విజయం సాధించలేరు. మీ జీవితంలో అన్నింటినీ గుర్తుంచుకొని బాధపడడం అవివేకం. వేటిని గుర్తుంచుకోవాలో వాటినే గుర్తుంచుకొని మిగతా వాటిని మరచిపోవడం ఉత్తమం. ఎప్పుడూ జీవితంలో వెలుగునే చూడడం నేర్చుకోండి. అప్పుడు అసలు చీకటే కనిపించదు. ఎప్పుడూ వెలుతురు వైపే మన దృష్టిని మరలిస్తే మన నీడ కూడా మనకు కనబడదని గుర్తుంచుకోండి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/