చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిఫై వైసీపీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన నందమూరి ఫ్యామిలీ సభ్యులు , తెలుగుదేశం నేతలు, కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ , నాగబాబు సైతం ఈ ఘటన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో రజనీకాంత్ ఆదివారం ఉదయం చంద్రబాబు కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘటన పట్ల విచారణ వ్యక్తం చేసారు.

ఇక శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు , నేతలు నిరసనలు తెలిపారు. వైసీపీ సర్కార్ ..చంద్రబాబుకు క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. మరోపక్క వైసీపీ నేతలు మాత్రం భువనేశ్వరి ఫై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని , చంద్రబాబు కావాలనే సింపతీ కోసం ఇలా చేసారని ఆరోపిస్తున్నారు.