అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

అలీ పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహ రిసెప్షన్ కు ఏపీ సీఎం జగన్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఫాతిమా రమీజున్ వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు కింగ్ నాగార్జున అమల దంపతులు నటి ఏపీ మంత్రి రోజా తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు హాజరై నూత వధూవరులని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి.

ఈ నేపథ్యంలో, తమ కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని అలీ దంపతులు నేడు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు. కాగా, ఈ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.