నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

TSPSC
TSPSC

తెలంగాణ సర్కార్ వరుస నోటిఫికెషన్స్ విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో సంబరాలు నింపుతుంది. ఇప్పటికే పలు నోటిఫికెషన్స్ విడుదల చేయగా..మ‌రో మూడు రోజుల్లో 16,940 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పుడు మరో 16, 940 ఉద్యోగాలకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, భర్తీలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 60 వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కాగా.. మరో 16 వేల 940 పోస్టులకు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. అయితే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ వేగంగా పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. అధికారులు గ‌డువులు నిర్దేశించుకొని ప‌ని చేయాల‌ని సూచించారు. వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్లు ఇచ్చేలా వివ‌రాలు అందించాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను సీఎస్ ఆదేశించారు.