ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సిఎం జగన్‌

ఇటీవల సిఎం జగన్‌ మామ గంగిరెడ్డి మృతి

cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు పులివెందులలోని భాకారాపురంలోని వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. దీనికి హాజరైన ముఖ్యమంత్రి ముందుగా గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందే వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ భారతి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి జ్ఞాపకాలను స్మరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.

తన తండ్రి ఈసీ గంగిరెడ్డి మంచి మనసున్న వైద్యుడని భారతి చెప్పారు. ఆయనకు ప్రజల వైద్యుడిగా మంచి గుర్తింపు ఉందని, ఆయన క్రమశిక్షణ, విలువలు పాటించేవారని తెలిపారు. తన తండ్రి అందరికీ అదర్శంగా నిలిచారని ఆమె చెప్పారు. తన తండ్రి ప్రతి రోజు 300 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారని తెలిపారు. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎవరైనా కలవడానికి వస్తే ఆప్యాయంగా పలకరించే వారని తెలిపారు. తన వద్దకు వైద్యం కోసం వచ్చేవారిని తన తండ్రి ఆత్మీయులుగా భావించేవారని ఆమె చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/