స్విమ్స్‌ ఆసుపత్రిలో ప్రమాదం..లోకేశ్‌ దిగ్భ్రాంతి

బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో ఓ ఉద్యోగిని మృతి

nara lokesh
nara lokesh

అమరావతి: తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కొవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో రాధిక అనే అటెండర్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టిడిపి నేత లోకేశ్ స్పందించారు. తిరుపతి స్విమ్స్ పద్మావతి కొవిడ్ సెంటర్ ప్రమాదం బాధాకరమని పేర్కొన్నారు. ఎంతోమంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదని లోకేశ్ ఆరోపించారు. పూర్తికాని భవనంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/