సినీ నటుడు కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలు

లారీని ఢీ కొన్న కారు

నెల్లూరు: సినీ నటుడు కత్తి మహేశ్‌కు రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. ఇన్నోవా కారులో నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ఆయ‌న‌ ప్రయాణిస్తున్న స‌మ‌యంలో అది ఓ లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన నెల్లూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/