గుజారత్‌ సిఎం భూపేంద్ర పటేల్‌ విజయం

cm-bhupendra-patel-heading-for-a-record-win

అహ్మాదాబాద్‌ః గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సిఎం భూపేంద్ర పటేల్‌ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సీఎంతో పాటు మరో 13 మంది విజయం సాధించారు. ఎల్లిస్‌బ్రిడ్జ్‌ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్‌ భాయ్‌, జలాల్‌పోర్‌ నుంచి రమేశ్‌బాయ్‌ పటేల్‌, రాజ్‌కోట్‌ పశ్చిమ స్థానం నుంచి దర్శిత షా, దహోద్‌ స్థానం నుంచి కన్నయ్యలాల్‌ కిశోరి, దరియాపూర్‌ నుంచి కౌశిక్‌భాయ్‌ జైన్‌, జస్తాన్‌ నుంచి కున్వర్జీభాయ్‌ బవాలియా విజయం సాధించారు. మరో 141 మంది ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గుజరాత్‌లో అధికార బిజెపి ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో కొనసాగుతున్నది. అసెంబ్లీలోని 182 స్థానాలకుగాను ఆ పార్టీ అభ్యర్థులు 141 చోట్ల ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ 30 స్థానాల్లో, ఆప్‌ 11, ఇతరులు 5 చోట్ల లీడ్‌లో ఉన్నారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 99 సీట్లు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీ 77 చోట్ల విజయం సాధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/