పెరూ దేశాధ్య‌క్షురాలిగా దినా బొలార్టే

Peru’s President Pedro Castillo replaced by Dina Boluarte after impeachment

లీమాః పెరూ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ దేశాధ్య‌క్షురాలయ్యారు. దినా బొలార్టే రాజ‌ధాని లిమాలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అభిశంస‌న త‌ర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబ‌సీకి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

దినా బొలార్టే వ‌య‌సు 60 ఏళ్లు. ఆమె ఓ లాయ‌ర్‌. జూలై 2026 వ‌ర‌కు తానే అధికారంలో ఉండ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాల‌ని ఆమె అన్నారు. కొంత స‌మ‌యం ఇస్తే దేశాన్ని కాపాడుతాన‌ని ఆమె తెలిపారు.

నిజానికి చాలా నాట‌కీయంగా పెడ్రో తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రిగింది. టీవీలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న దేశంలో అత్య‌యిక స్థితిని ప్ర‌క‌టించారు. కానీ పెడ్రో తీరును ఆగ్ర‌హించిన ఎంపీలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. సుమారు 101 మంది నేత‌లు ఆయ‌న‌పై అభిశంస‌న ప్ర‌క‌టించాయి. ఆ త‌ర్వాత పెడ్రోను పోలీసులు అరెస్టు చేశారు. పెడ్రో భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/