రేపు సీఎల్పీ భేటీ

ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది.ఈ నెల 12న అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

కాగా కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే 13వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.