సీనియర్‌ నటి జయంతి కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ సినీనటి జయంతి ( 76) కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జ‌యంతి క‌న్నుమూశారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయంతి.. 1945 జనవరి 6న కర్ణాటకలోని బ‌ళ్లారిలో జన్మించారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు హిందీ, మరాఠీ సినిమాలతో కలిపి 5 వందలకుపైగా సినిమాల్లో నటించారు.


ఇప్పటి వరకు దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించారు. జ‌యంతి మృతిపై తెలుగు చిత్రసీమ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/