సీఎం జగన్ ఫై ఎంపీ రఘురామ రాజు ఫైర్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ తన సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ.. పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం నలురుగు రెడ్ల చేతుల్లోనే సాగుతోందని విమర్శించారు. కులం, మతం చూడబోమంటూ సీఎం జగన్ తరచూ చెబుతున్న మాటలకు ఆయన చేతలకు పొంతన లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ కేడర్‌కు చెందిన 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారని రఘురామ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)గా సీఎం సొంత జిల్లాకు చెందిన జవహర్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా పులివెందులకు చెందిన మరో ఐఏఎస్ అధికారి కంట్రోల్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.

జగన్‌ రెడ్డితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారని రఘురామ అన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అసలు చోటే కల్పించలేదని అన్నారు. కులం, మతం చూడబోనని పదే పదే చెప్పే జగన్.. ప్రాధాన్యత గల పోస్టుల్లో తన కులాన్ని మాత్రమే చూస్తారని రఘురామ దుయ్యబట్టారు. ప్రజల పక్షాన నిలబడిన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించడం సహేతుకంగా లేదని రఘురామ అన్నారు.