బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న కేజీయఫ్‌-2

కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజీయఫ్‌-2 . కేజీయఫ్‌-1 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం టాక్ టాక్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.290 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ లో రెండే రోజుల్లో వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టడం సరికొత్త రికార్డని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదేస్థాయిలో వసూళ్లను రాబట్టడంతో మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్‌ వీక్‌ ముగిసేసరికి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను కలెక్ట్‌ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌, హీరోయిన్‌గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు.