ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి
70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల

Vijayawada: ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది.
దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కృష్ణా కరకట్టల వెంట జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ ప్లో 7లక్షల 71వేల 551 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ప్లో 7లక్షల 65వేల 023 క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లంక గ్రామాలు, పల్లవి ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇప్పటివరకు 1736 కుటుంబాలకు చెందిన వరద ముందు బాధితులను ఆయా పునరావాస కేంద్రాలకు తరలించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/