కొనసాగుతన్న కోవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్

తాజాగా ఐదుగురు వలంటీర్లకు తొలి డోసు

Clinical trials begin for Bharat Biotech’s COVID-19

హైదరాబాద్‌: నిమ్స్‌లో భారత్‌ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన ఐదుగురు వలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్ తొలి డోసు ఇచ్చారు. వారిని 24 గంటల పాటు నిమ్స్ వైద్యులు పరిశీలనలో ఉంచనున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంటే వారిని రేపు డిశ్చార్జి చేయనున్నారు. ఆపై 14 రోజుల పాటు ఇంటి వద్దనే అబ్జర్వేషన్ లో ఉంచనున్నారు. ఇప్పటివరకు నిమ్స్ లో ఎనిమిది మంది వలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/