నేడు అసెంబ్లీ సమావేశాలపై కెసిఆర్‌ సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో ఆసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి శాస‌న మండ‌లి, శాస‌నస‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేప‌థ్యంలో స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, అనుస‌రించాల్సిన వ్యూహం, ఇత‌ర అంశాల‌పై సిఎం చ‌ర్చించనున్నారు. అదేవిధంగా క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా స‌మావేశాలను ఎలా నిర్వ‌హించాల‌నే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. ఈ సమావేశంలో మంత్రులు, ఇత‌ర‌ నేతలు పాల్గొననున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/