మొక్కలు పెంచేముందు

పెరట్లో మొక్కలు… సంరక్షణ

Care of plants
Before growing plants

కొత్తగా నర్సరీలకు వెళ్లి మొక్కలు కొనేటప్పుడు ఎవరైనా చాలా ఉత్సాహంతో ఉంటారు. అవసరానికి మించి మొక్కలు కొనితెస్తారు. వాటిని ఎలా సాకాలి అనే విషయాలు తెలియకుండా, కనీసం ముందుగా ప్లాన్‌ చేసుకోకుండా గుడ్డిగా ముందుకు వెళతారు.
దాంతో తెచ్చిన వాటికి సరైన పోషణ అందక ఎండిపోతాయి. అందుకే మొక్కలు పెంచేముందు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది.

పెరిగే మొక్కలను ఎంచుకోండి…

కొత్తగా మొక్కల పెంపకం చేసేవారు పెద్దగా పట్టించుకోక పోయినా పెరిగే మొక్కలను కొని ఇంటికి తెచ్చుకోవాలి. వాటి బాగోగులు అప్పుడప్పుడు చూసుకున్నా సరిపోతుంది. స్నేక్‌ ్‌ప్లాంట్‌, మన్సీప్లాంట్‌ లాంటి మొక్కలయితే వాటి పోషణ మీద శ్రద్ద పెట్టకపోయినా మొండిగా బతికేస్తాయి.

సరైన ధర తెలుసుకోండి !

మొక్కలను వెంటనే కొనకుండా చుట్టుపక్కల ఉన్న నర్సరీల్లో కూడా వాకబు చేయండి. దీనివల్ల కొన్ని రోజులు అలస్యంగా అయినా తక్కువ ధరకే మకు కావలసిన మొక్కలు దొరికే అవకాశం ఉంటుంది మొక్క నిచ్చింది అంటే చాలు నర్సరీ నిర్వాహకులు దాని ధర అమాంతం పెంచేస్తారు. మొక్కలైనా సరే మిగతావాటిలాగే బేరమాడాల్సిందే.

మొక్కల గురించి అవగాహన !

మొక్కను కొనేటప్పుడే దానికి ఎంత మోతాదులో నీరు, వెలుతురు అవసరం అవుతుందనే విషయం నర్సరీ నిర్వాహ కులను అడిగి తెలుసుకోవాలి. కొన్ని రోజులు పెంచాక మొక్క గురించి అన్ని విషయాలు అవగాహన అవుతాయి. అనువైన స్థలం కోసం.. మొక్కలు కొనేమందు స్థలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పెద్ద మొక్కలు కొని వాటిని ఉంచడానికి ఇంట్లో స్థలం లేకపోతే ఇబ్బందులు తప్పవు. స్థలాన్ని వాటిని పెట్టి చోటును బట్టి మొక్కలను ఎంచుకోవడం ఉత్తమం.