మృదువైన పాదాల కోసం

అందమే ఆనందం

మృదువైన పాదాలు మగువుల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయనటంలో సందేహం లేదు.. కాబట్టి పాదాల సంరక్షణ విషయాలను తెలుసుకుందాం . పాదాల రక్షణ లో వెనిగర్ పాత్ర చాలా వుంది..

ముందుగా షూస్ వేసుకునే అలవాటు ఉన్న కొందరిలో సాక్స్ విప్పకుండా దుర్వాసన వస్తూ ఉండటం గమనించే ఉంటారు… చెమటతో బాక్టేరియా కలవటమే కారణం.. వెనిగర్ .. బాక్టేరియా, ఫంగస్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చల్లటి నీటిలో పావు కప్పు వెనిగర్ వేసి పాదాలను 5 నిముషాలు అందులో ఉంచండి.. ఇలా తరకూ చేస్తుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.


పొడిబారిన పాదాలు, పగుళ్లు నొప్పి, దురదలకు కారణం అవుతాయి. వెనిగర్ లో ఉండే యాసిడ్లు పాదాలకు తేమతో పాటు మృదుత్వాన్ని అందిస్తాయి.. పగుళ్ళకు ఇది మందుగా పనిచేస్తుంది. కొందరిలో చెమట కారణంగా కాలి వేళ్ళ మధ్య ఇన్ఫెక్షన్ లు చిన్న కురుపులాంటి వి వస్తుంటాయి.. వెనిగార్లోనే అంటి ఫంగల్ ఇందుకు చక్కగా పనిచేస్తుంది. గ్లాసు నీటిలో పావు కప్పు వెనిగర్ ను కలిపి దూదితో సమస్య ఉన్న చోట రాసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

తెర -(సినిమా) వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/