మంచు అన్నదమ్ముల మధ్య గొడవ ..

మంచు అన్నదమ్ముల మధ్య గొడవ ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా మంచు మనోజ్ – విష్ణు ల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు చిత్రసీమలో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మనోజ్ …తన సన్నిహితుడు ఫై మంచు విష్ణు చేయి చేసుకోవడం తో వారి మధ్య విషయాన్ని బయటపెట్టాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టబోయడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. మొదట్లో సారథి.. విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత విష్ణు నుంచి దూరంగా ఉంటూ మంచు మనోజ్‌‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ.. అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ విడుదల చేశాడు. విష్ణు తరచూ ఇలా చేస్తున్నాడంటూ మనోజ్‌ కామెంట్‌ చేశారు. మేమేమైనా ఊరికే ఇచ్చామా, తీసుకున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. కాగా మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.