తెలంగాణలో భారీగా కలెక్టర్ల బదిలీలు..?

తెలంగాణలో భారీగా కలెక్టర్ల బదిలీలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించి సర్కార్ బదిలీల కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ఐఏఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. పలువురు ఐఏఎస్ లు నాలుగేళ్లుగా ఒకే పోస్టులో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారు. బదిలీల తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఐఏఎస్ ల బదిలీలపై ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్‌ ఉంది. చాలా కాలం తర్వాత ఐఏఎస్ ల బదిలీలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనుకోవాలి. నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. మెజారిటీ జిల్లా కలెక్టర్లను బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు.